డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను కేంద్రం రీకాల్ చేస్తేనే విగ్రహాల విధ్వంసకులెవరో తేలుతుందని తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. పశ్చిమబంగాల్‌లో ముగ్గురు ఐపీఎస్‌లను వెనక్కి పిలిచిన కేంద్రం... వైకాపా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న డీజీపీని ఎందుకు పిలవదని ప్రశ్నించారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో నిర్వహించిన ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమంలో అయ్యన్న పాల్గొన్నారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం వెనకంజ వేస్తోందని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు సేకరించిన సుమారు 27 వేల రూపాయలను అయోధ్య రామమందిర నిర్మాణానికి అయ్యన్న అందజేశారు.
'డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను కేంద్రం వెనక్కి పిలవాలి' - narsipatnam latest news
డీజీపీ గౌతమ్ సవాంగ్ రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. సవాంగ్ వ్యవహారశైలిపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు.
ayyanna patrudu