ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రంజాన్ వేడుకలు ఇళ్లవద్దే జరుపుకోవాలి: మంత్రి అవంతి - రంజాన్ వేడుకలపై మంత్రి అవంతి కామెంట్స్

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పరిమితులకు లోబడి రంజాన్ పండుగ నిర్వహించుకోవాలని ముస్లిం మత పెద్దలకు మంత్రి అవంతి సూచించారు. ముస్లిం సోదరులు రంజాన్ వేడుకలను ఇళ్లవద్దే జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.

రంజాన్ వేడుకలు ఇళ్లవద్దే జరుపుకోవాలి
రంజాన్ వేడుకలు ఇళ్లవద్దే జరుపుకోవాలి

By

Published : Apr 22, 2020, 3:16 AM IST

కరోనా వైరస్ కట్టడి నేపథ్యంలో ముస్లిం సోదరులు రంజాన్ వేడుకలను ఇళ్లవద్దే జరుపుకోవాలని మంత్రి అవంతి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. విశాఖ జిల్లా కలెక్టర్​, ఎస్పీలతో కలిసి రంజాన్ వేళ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముస్లిం మత పెద్దలతో సమావేశం నిర్వహించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పరిమితులకు లోబడి పండుగ నిర్వహించుకోవాలని ముస్లిం మత పెద్దలకు సూచించారు. వీలైనంత వరకు ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం కావాలన్నారు. విశాఖలో సుమారు 25వేల మంది ముస్లింలు ఉన్నారని.. వారందరికీ ప్రగతి భారతి ట్రస్టు ద్వారా నిత్యావసరల పంపిణీ చేస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details