విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం రైవాడ జలాశయం ప్రధాన మట్టిగట్టు శిథిలమై.. ప్రమాదకరంగా ఉందని ఇటీవల ఈటీవీ - ఈటీవీ భారత్ లో వచ్చిన కథనాలకు.. జలవనరుల శాఖ ఉన్నతాధికారులు స్పందించారు. ఉత్తరాంధ్ర జలవనరుల శాఖ సీఈ శివరామ ప్రసాద్... జలాశయాన్ని పరిశీలించారు.
జలాశయం ప్రధాన గట్టు పటిష్ఠానికి రూ.10 కోట్ల ఖర్చు అవుతుందని ప్రాథమిక అంచనా వేశారు. ఆ మేరకు ప్రతిపాదనలు పంపించామని చెప్పారు. ఈ నిధులతో గట్టు పటిష్టం చేసి, ఇతర అభివృద్ధి పనులు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. జలాశయాన్ని ఈనెల 21న కేంద్ర, రాష్ట్ర నిపుణులతో కూడిన జలవనరుల శాఖ అధికారుల బృందం పరిశీలన చేయనుందని.. ప్రతిపాదిత నిధులకు ఆ బృందం ఆమోదం తెలపాల్సి ఉందని చెప్పారు.