విశాఖ జిల్లా చోడవరంలో ఏర్పాటు చేసిన నిఘా నేత్రాలు (సీసీ కెమెరాలు) పనిచేయడం లేదు. నేర సంఘటనలు, ఇతర అంశాలను నిక్షిప్తం చేసి కేసు దర్యాప్తులో ఎంతో ఉపయోగకరంగా ఉంటూ వచ్చేవి. ప్రస్తుతం అవి కాస్తా నిరూపయోగంగా మారాయి. చోడవరం పట్టణంలో 48 సీసీ కెమెరాలను వివిధ కూడలిలో ఏర్పాటు చేశారు. వీటిలో ప్రధాన కూడలిలో ఉన్న ఎనిమిది కెమెరాలు పని చేయడం లేదు.
పని చేయని నిఘా నేత్రాలు
నేటి సమాజంలో భద్రతలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి సీసీ కెమెరాలు. ముఖ్యంగా బ్యాంకులు, రహదారులు, కార్యాలయాల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా పోలీసులు సులభంగా ఛేదించగలరు. ఇలా ప్రస్తుత జీవన గమనంలో ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది ఈ ఆధునిక పరికరం. అటువంటి నిఘా నేత్రాలు చోడవరంలో పనిచేయడం లేదు. దీంతో దుండగులు సులువుగా తప్పించుకొగా... పోలీసులకు వారిని పట్టుకోవటం కష్టతరంగా మారింది.
పనిచేయని నిఘా నేత్రాలు
ఇటీవల చోడవరంలో ఏటీఎంల వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు ఖాతాదారులను మోసం చేసి రూ.40,000 కాజేశారు. మరో ఏటీఎం అద్దాలు పగుల కొట్టారు. నిఘా నేత్రాలు పని చేస్తే దుండగులు దొరికే వారని చెబుతున్నారు. దీనిపై స్పందించిన ఎస్సై విభీషణరావు... కెమెరాలను బాగు చేసినట్లు తెలిపారు.
ఇదీ చదవండీ...రైలు పట్టాలపై 'ప్రైవేటు' కూతతో మరింత నష్టమా?