నర్సీపట్నం వైద్యుడు డాక్టర్ సుధాకర్ కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు మొదలుపెట్టింది. సుధాకర్ చికిత్స పొందుతున్న విశాఖ మానసిక ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాధ, చికిత్స అందించిన డా.రామిరెడ్డి ఇతర వైద్యులను సీబీఐ వేరువేరుగా ప్రశ్నించింది. మొత్తం ఆరుగురితో కూడిన సీబీఐ బృందం వేర్వేరు గదుల్లో ఆస్పత్రి వైద్యులు, సిబ్బందిని విచారించి.. వైద్యుల సమాధానాలను రికార్డు చేసింది.
దాదాపు 20 ప్రశ్నలు వేసి వాటి సమాధానాలు ఆధారంగా మిగిలిన విచారణ సాగించనుంది. డాక్టర్ సుధాకర్‌ను కూడా విచారించి ఆయన వాదనను రికార్డు చేయనుంది. సీబీఐ ఎస్పీ నేతృత్వంలో విచారణ బృందం పనిచేస్తుంది. ఆసుపత్రి ప్రధాన గేట్లు మూసివేసి.. ఇతరులను లోపలికి అనుమతించడం లేదు. ఇతర రోగుల వద్ద సహాయకులు కూడా లేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.