విశాఖ ఏజెన్సీకి 3,300 అడుగుల ఎత్తులో అనేక కొండలు ఉన్నాయి. మరెన్నో అందాలు కొండలపై భాగంలో దర్శనమిస్తాయి. ఇటీవల వంజంగి కొండ ప్రాంతానికి పర్యాటకుల తాకిడి పెరిగింది. దీనికి సమీపంలో ఉన్న కొత్తవలస గ్రామంలో మూడు గుహలున్నాయి. అక్కడికి రహదారి సౌకర్యం కల్పిస్తే..పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని గిరిజనులు అంటున్నారు. దీంతో వారికి ఉపాధి ఏర్పడి ఆదాయ మార్గం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
రోడ్డు సౌకర్యం లేక వంజంగి కొండ ప్రాంతంలో నివసించే ప్రజల కష్టాలను వివరిస్తూ 'రహదారి లేక డోలి కష్టాలు' అనే శీర్షికన ఈటీవీ ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణం చేపట్టారు. దీంతో ఆ గిరిజనులకు కొంత ఊరట లభించింది. ఇటీవల ఈ మార్గంలో ప్రారంభమవటంతో పర్యాటకులు వెళ్లి కొండ అందాలను చూసి మురిసిపోతున్నారు. శీతాకాలం మొదలవటంతో మంచుకురిసి కొండలను కమ్మేసింది. ఒకవైపు పచ్చదనం, మరోవైపు సూర్యకిరణాల తాకిడికి ముత్యంలా మెరిసే మంచు చూపరులను మంత్రముగ్ధులను చేస్తోంది.