గులాబ్ తుపాను ప్రభావంతో.. విశాఖ జిల్లాలోని రైవాడ జలాశయం పూర్తిగా నిండింది. జలాశయం గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేయటంతో.. చోడవరం మండలం గవరవరం వద్ద శారదానదిపైన కాజ్‌వే పూర్తిగా కొట్టుకుపోయింది. చోడవరం, దేవరాపల్లి, కె.కోటపాడు మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
శారదా నదిపై వంతెన 2012లో కూలింది. దీంతో రాకపోకల సాగించేందుకు.. నదిపై తాత్కాలిక కాజ్వేను నిర్మించారు. ఇప్పటికీ ఈ కాజువే నాలుగు దఫాలుగా కొట్టుకుపోగా.. ఇలా జరగటం ఇది ఐదవ సారి అని గ్రామస్థులు తెలిపారు.