విశాఖ జిల్లా పద్మనాభం మండలం సంగివలస గ్రామ సమీపంలో ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న దాదాపు 30 మంది వలస కార్మికులు కుటుంబాలను వారి వారి స్వగ్రామాలకు చేర్చేందుకు కేథరిన్ విద్యాసంస్థల ఛైర్మన్ ఆలీవర్ రాయ్ ముందుకువచ్చారు. నోడల్ ఆఫీస్ అధికారులు అభ్యర్థన మేరకు ఓ ప్రత్యేక బస్సును ఏర్పాటు చేశారు. వలస కూలీలకు రొట్టెలు, బిస్కెట్స్, అరటి పండ్లు, నీళ్లు అందించారు. తహసీల్దార్ పర్యవేక్షణలో వలస కుటుంబాలను బస్సులో తరలించారు.
ఇటుక బట్టీల కార్మికులకు బస్ సౌకర్యం - catherin educational institutes chairman help to migrant people news
వలస కూలీలను స్వస్థలాలకు తరలించేందుకు పలువురు దాతలు సైతం ముందుకు వస్తున్నారు. విశాఖ జిల్లాలో ఇటుక బట్టీ కార్మికులను తరలించేందుకు కేథరిన్ విద్యాసంస్థల ఛైర్మన్ ప్రత్యేక బస్సు ఏర్పాటు చేశారు. తహసీల్దార్ పర్యవేక్షణలో వీరు సొంతూళ్లకు వెళ్లనున్నారు.
ఇటుక బట్టీల కార్మికులకు బస్ సౌకర్యం