ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జీడిపిక్కల కర్మాగారం పునఃప్రారంభం...పనుల్లోకి కార్మికులు - విశాఖలో జీడిపిక్కల కర్మాగారం ప్రారంభం

కరోనా కారణంగా గత నెల రోజులుగా మూతపడ్డ విశాఖ జిల్లా జానకిరాంపురం జీడిపిక్కల కర్మాగారం తిరిగి పునఃప్రారంభమైంది. కార్మికులు తగిన జాగ్రత్తలు పాటిస్తూ పనుల్లో చేరారు.

cashew
జీడిపిక్కల కర్మాగారం పునఃప్రారంభం

By

Published : Apr 25, 2020, 12:17 PM IST

లాక్​డౌన్ కారణంగా మూతపడ్డ విశాఖ జిల్లా జానకిరాంపురం జీడిపిక్కల కర్మాగారం తిరిగి పునఃప్రారంభమైంది. కార్మికులు తగిన జాగ్రత్తలు పాటిస్తూ పనుల్లో చేరారు. వైరస్ వ్యాప్తి కారణంగా గత నెలరోజులుగా కర్మాగారాన్ని మూసేశారు. దీంతో ఇతర ప్రాంతాలకు ఎగుమతి నిలిచిపోయి కోట్లల్లో నష్టం వాటిల్లింది. అయితే ఇటీవల అత్యవసర ఆహార ఉత్పత్తులకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించటంతో ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించారు. ఈ పరిశ్రమ ద్వారా సుమారు 400 మంది ఉపాధి పొందుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details