విశాఖ జిల్లా గొలుగొండ మండలం పాతమల్లంపేట శివారు కొత్తపాలెంలో అప్పలనాయుడు అనే రైతుకు చెందిన రెండున్నర ఎకరాలలో జీడీతోట దగ్ధమైంది. సుమారు మూడున్నర లక్షల మేర నష్టం వాటిల్లినట్లు రైతు తెలిపారు.
గురువారం ఉదయం అనుమానాస్పదంగా మంటలు వ్యాపించి... పక్వానికి వచ్చిన చెట్లు కాలిపోయాయి. జీడిపిక్కలు కొత దశలో ఉండగా ఈ ప్రమాదం సంభవించడంతో బాధిత రైతు కన్నీరుమున్నీరయ్యడు. అధికారులు స్పందించి ఆదుకోవాలని బాధిత రైతు కోరుతున్నాడు.