విశాఖ జిల్లా అనకాపల్లిలో తాజాగా 55 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 800కు చేరుకుంది. పట్టణంలోని గవరపాలెం, వేల్పుల వీధి, శ్రీ రామ్నగర్ కాలనీ, న్యూ కాలనీ, పూడిమాడక రోడ్డు, గాంధీనగరం, పప్పుల వీధి, సబ్బవరం రోడ్డు, నర్సింగరావు పేట ప్రాంతాల్లో వ్యాధి తీవ్రత ఉద్ధృతంగా ఉంది. పట్టణ పోలీస్ స్టేషన్కు చెందిన ముగ్గురు సిబ్బంది కూడా వ్యాధి బారిన పడ్డారు. దీంతో అధికారులు మంగళవారం నుంచి పట్టణంలో పాక్షిక లాక్డౌన్ కొనసాగిస్తున్నారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే దుకాణాలకు అనుమతిచ్చారు. కరోనా బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తెలియజేశారు.
అనకాపల్లిలో 800కు చేరిన కరోనా కేసుల సంఖ్య - visakha district latest corona cases
అనకాపల్లిలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా 55 కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి పట్టణంలో కేసుల సంఖ్య 800కు చేరుకుంది.
అనకాపల్లిలో పెరుగుతున్న కరోనా కేసులు