ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్రమంగా ఇసుక తరలింపు.. గ్రామ వాలంటీరుపై కేసు - Case registered against a village volunteer to moving sand illegally latest news

విశాఖ జిల్లా శారదా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. గ్రామ వాలంటీరు నిర్వాకాన్ని గుర్తించారు. అతనిపై కేసు నమోదు చేసి.. ట్రాక్టర్ సీజ్ చేశారు.

అక్రమంగా ఇసుక తరలింపు.. ట్రాక్టర్ సీజ్
అక్రమంగా ఇసుక తరలింపు.. ట్రాక్టర్ సీజ్

By

Published : May 16, 2021, 2:34 PM IST

విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం తామరబ్బ సమీపంలోని శారదా నదిలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయన్న సమాచారంతో.. దేవరాపల్లి పోలీసులు దాడులు నిర్వహించారు. నది నుంచి ట్రాక్టర్ పై ఇసుక తరలిస్తున్న డ్రైవర్, గ్రామ వాలంటీరుగా పనిచేస్తున్న పైడిరాజుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సింహాచలం చెప్పారు. ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ స్వాధీనం చేసుకుని, స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించామన్నారు.

ABOUT THE AUTHOR

...view details