విశాఖ జీవీఎంసీ ప్రహ్లాదపురం ప్రాంతంలో ఓ బాలిక తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. అదే ప్రాంతంలో నివాసముండే గౌతమ్ రాజు అనే యువకుడితో ఆ బాలికకు పరిచయం ఏర్పడింది. బాలిక మైనారిటీ తీరిన తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించిన గౌతమ్ రాజు.. బాలికకు శారీరకంగా దగ్గరవడంతో ఆమె గర్భం దాల్చింది. గమనించిన కుటుంబసభ్యులు బాలికను నిలదీయడంతో జరిగిన విషయాన్ని వివరించింది. ఈ ఘటనతో ఆగ్రహం వ్యక్తం చేసిన బాలిక కుటుంబీకులు బాధితురాలిని పెళ్లి చేసుకోవాలని గౌతమ్ రాజును కోరగా.. అతడు నిరాకరించాడు. ఫలితంగా గౌతమ్ రాజుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రేమ పేరుతో మోసం.. బాలికను గర్భవతిని చేసిన యువకుడు - vizag latest news
విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో దారుణం జరిగింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ బాలికను గర్భవతిని చేశాడు. అనంతరం పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేశాడు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పెందుర్తిలో బాలికను గర్భవతిని చేసిన యువకుడు