విశాఖకు చెందిన హరి వెంకటరమణ, రాంబాబు రెండు దశాబ్దాలుగా కార్టూనిస్టులుగా వ్యంగ్య చిత్రాలను సృష్టిస్తున్నారు. కరోనాపై కార్టూనిస్టులు స్థానిక, రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపై వ్యంగ్య చిత్రాలతో వ్యాఖ్యానిస్తున్నారు. శానిటైజర్లు వాడకం, చేతులు కడుక్కోవడం, భౌతిక దూరం పాటించటం వరకు సామాన్యుల్లో అవగాహన కల్పిస్తూనే, ఒక్కో సందర్భంలో ఒక్కో విధంగా వ్యంగ్యంతో, జాగరూకత కలిగిస్తున్నారు.
కరోనాపై అదిరిపోయే కార్టూన్స్....
ఆ కుంచెలు కదిలితే చైతన్యం సామాజిక సందేశమై వ్యంగ్య చిత్రాలు రూపుకడతాయి. కరోనా లాక్డౌన్లో సామాన్య జీవనంలోని వైపరీత్యాలు, వింత ధోరణులు ఆ కార్టూనిస్టుల చిత్రాలకు ప్రాణం పోశాయి. విశాఖ జిల్లాకు చెందిన ఈ కార్టూనిస్టుల బొమ్మలుపై ఓ లుక్కేయండి!
కరోనాపై అదిరిపోయే కార్టూన్స్....