విశాఖ జిల్లా అనకాపల్లి పట్టణం, మండల ప్రాంతాల్లో పది మందికి కరోనా నిర్దరణ అయింది. అనకాపల్లి పట్టణంలోని నర్సింగ్రావుపేటలో నివాసం ఉంటున్న పోలీసు స్టేషన్ అదనపు ఎస్ఐ, ఇతని అల్లుడికి కరోనా సోకింది. అనకాపల్లి గ్రామీణ సీఐ కార్యాలయంలో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్‌కి, నూకలమ్మ కోవెల సమీపంలో వార్డు వాలంటీర్‌కి కరోనా సోకింది. ఉప్పల వారి వీధి, గవరపాలెం చిన్నయ్య గారి వీధిలో ఇద్దరు మహిళలు కరోనా బారిన పడ్డారు. అనకాపల్లి మండలంలోని కూడ్రం గ్రామంలో ముగ్గురికి కరోనా సోకింది. వీరు చెన్నై నుంచి వచ్చారు. సత్యనారాయణపురంలో హైదరాబాద్ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా నిర్ధరణ అయింది. కేసులు పెరుగుతుండడం పట్ల స్థానికులు ఆందోళన చెెందుతున్నారు.
అనకాపల్లిలో కొత్తగా పదిమందికి కరోనా - carona update in anakapalli
విశాఖ జిల్లా అనకాపల్లిలో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. కొత్తగా పది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో అదనపు ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్, వార్డు వాలంటీర్ కూడా ఉన్నారు.
అనకాపల్లిలో కొత్తాగా పదిమందికి కరోనా