విశాఖ జిల్లా నర్సీపట్నంలో కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన అనేక భవనాలు కరోనా ప్రభావంతో ప్రారంభోత్సవాలకు బ్రేక్ పడింది. వీటి సేవలు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయని పట్టణ ప్రజలు ఎదురుచూస్తున్నారు. సుమారు నాలుగు కోట్ల రూపాయలతో నిర్మించిన ఇండోర్ విద్యుత్ ఉపకేంద్రం ఇటీవలే సాంకేతిక పరీక్షలు పూర్తిచేసుకుని సిద్ధమైంది.
అలాగే స్థానిక ప్రాంతీయ ఆసుపత్రి ప్రాంగణంలో సుమారు 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన వాయిస్ కేంద్రం పరిస్థితి అంతే ఇది నిర్మాణం పూర్తైనా ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. ప్రకృతి వైద్యం యోగా తదితర సదుపాయాలు అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని దీని నిర్మాణానికి తలపెట్టారు సిబ్బంది వైద్యుల నియామకానికి వీలుగా అన్నీ సిద్ధం చేశారు