విశాఖ ఏజెన్సీ పాడేరు ఘాట్ రోడ్ డైమండ్ పార్క్ సమీపంలో పర్యాటకుల కారు బోల్తా పడింది. ప్రమాదస్థలంలో వాహనదారులు ఎవరూ లేరు. పొగమంచు దట్టంగా కమ్మేసి ఉన్నప్పుడు రహదారి కనిపించక ప్రమాదానికి గురై ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. ఈ కారు ఎవరిది ? ఎలా? జరిగింది. అనేక కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విశాఖ మన్యానికి వచ్చేటప్పడు ప్రమాదకరమైన మలుపులు, బండ రాళ్లు ఉంటాయి. వాహనాలు నడుపుతున్నప్పుడు మితిమీరిన వేగంతో వెళ్లవద్దని.. మద్యం సేవించి ప్రయాణం చేయవద్దని.. పోలీసులు హెచ్చరిస్తున్నారు.
పాడేరు ఘాట్ రోడ్డులో కారు బోల్తా - పాడేరులో రోడ్డు ప్రమాదం
విశాఖ జిల్లా పాడేరు ఘాట్ రోడ్డులో పర్యాటకుల కారు బోల్తా పడింది. జనసంచారం లేని సమయంలో ఈ ప్రమాదం జరగడంతో వాహనదారులు కారుని వదిలి వెళ్లిపోయారు. ఈ కారు ఎవరిది ? ఎలా? జరిగింది. అనే కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
![పాడేరు ఘాట్ రోడ్డులో కారు బోల్తా car overturned on the road in Paderu visakhapatnam district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10057920-172-10057920-1609321544899.jpg)
పాడేరు ఘాట్ రోడ్డులో కారు బోల్తా