అరకు ఘాట్రోడ్డులో కారు దగ్ధం
విశాఖ జిల్లా అరకులోయ ఘాట్ రోడ్డులో ఒడిశాకు చెందిన పర్యాటకుల కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీనిని గమనించిన డ్రైవర్ వెంటనే కారును రహదారి పక్కన నిలిపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ కారు 70 శాతం కాలిపోయింది. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి అపాయం కలగకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
అరకు ఘాట్రోడ్డులో కారు దగ్దం