విశాఖపట్నం నగరంలోని తాటిచెట్లపాలెం ప్రాంతానికి వెంకటేష్ జీవనోపాధి కోసం లాక్‌డౌన్‌కి ముందు కారు కొన్నాడు. గురువారం ఉదయం గుంటూరు జిల్లాకు చెందిన అలేఖ్ అనే వ్యక్తి శ్రీశైలం వెళ్లడానికి కిరాయికి మాట్లాడుకొని బయల్దేరారు. కారంపూడి సమీపంలోకి వెళ్లేసరికి రాత్రి కావడంతో, విశ్రాంతి తీసుకొని ఉదయం వెళదామని అలేఖ్ చెప్పగా కారును రోడ్డుపక్కన పెట్టాడు. ముందుగా తెచ్చుకున్న మద్యంలో వెంకటేష్‌కు తెలియకుండా సైనేడ్ కలిపి ఇచ్చాడు. అది తాగిన వెంకటేష్ కొద్దిసేపటి తర్వాత కారులోనే మృతి చెందాడు.
డ్రైవరును హతమార్ఛి.. కారు అపహరణకు యత్నించి - latest news of senide murders case
శ్రీశైలం వెళదామని కారు కిరాయికి మాట్లాడుకుని బయల్దేరాడు.. మార్గమధ్యలో డ్రైవరుతో మాటలు కలిపాడు. అలిసిపోయాం.. విశ్రాంతి తీసుకుని బయల్దేరదాం.. అంటూ రోడ్డు పక్కన కారు ఆపించాడు. కొంతసేపటికి సైనేడ్ కలిపిన మద్యాన్ని గ్లాసులో పోసి ఇచ్చాడు. దాన్ని తాగి డ్రైవర్ కారులోనే వాలిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
car driver murder case culpirt arrested in visakha
మృతదేహాన్ని ఎక్కడైనా పడేసి కారును తీసుకుని పరారవ్వాలని భావిస్తున్న సమయంలో గస్తీ పోలీసులు ప్రశ్నించారు. డ్రైవర్ మద్యం తాగి పడుకున్నాడని, నిద్ర లేచిన తర్వాత శ్రీశైలం వెళతామని అలేఖ్ చెప్పాడు. డ్రైవర్‌ని లేపమని పోలీసులు గద్దించడంతో అలేఖ్ పరారవ్వడానికి ప్రయత్నించాడు. అతన్ని పట్టుకుని విచారించగా డ్రైవర్‌ను హత్య చేసినట్లు తెలిపాడని పోలీసులు వెల్లడించారు.
ఇదీ చూడండి