విశాఖ జిల్లా పాడేరులో ఓ వ్యక్తి మద్యం మత్తులో కారు నడిపి వనుగుపల్లికి చెందిన తండ్రీ కొడుకులను వెనుక నుంచి ఢీ కొట్టాడు. తీవ్ర గాయాలపాలైన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. కారులో ప్రయాణిస్తున్నవారు పరారీలో ఉన్నారు. మద్యం మత్తులో వాహనం నడిపి ఉదయ్ కుమార్ అనే వ్యక్తి ప్రమాదానికి కారణమయ్యాడని.. అతన్ని వెంటనే అరెస్టు చేయాలని బాధిత కుటుంబీకులు ఆందోళనకు దిగారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మద్యం మత్తులో కారుతో ఢీ.. తండ్రి, కుమారునికి గాయాలు - విశాఖ మన్యం పాడేరు శివారులో కారుతో ఢీ వార్తలు
మద్యం మత్తులో కారు నడిపిన ఓ వ్యక్తి తండ్రీ కొడుకులను ఢీ కొన్న ఘటన విశాఖ జిల్లా పాడేరులో జరిగింది. వెంటనే స్పందించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పాడేరు శివారులో తండ్రి కొడుకులను ఢీకొట్టిన కారు