విశాఖ జిల్లా పాడేరు నుంచి మూడు ద్విచక్రవాహనాలపై నలుగురు వ్యక్తులు గంజాయిని తీసుకొచ్చారు.దువ్వాడ రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా తిరగడంతో రైల్వే ప్రోటెక్షన్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న బ్యాగులు తనిఖీ చేయగా గంజాయి బయటపడింది. వెంటేనే దువ్వాడ పోలీసులకు అప్పగించారు. ఆ గంజాయి సుమారు 50 నుంచి 60 కిలోలు ఉంటుందని పోలీసులు చెప్పారు.
నిరుద్యోగులతో గంజాయి సరఫరా... నలుగురు అరెస్టు - cannibes seized in duvvada railway station
అక్రమంగా గంజాయి తరలిస్తున్న నలుగురు వ్యక్తులను... దువ్వాడ రైల్వేస్టేషన్లో పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు 50 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
![నిరుద్యోగులతో గంజాయి సరఫరా... నలుగురు అరెస్టు cannibes seized in duvvada railway station](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5257810-1027-5257810-1575381832466.jpg)
దువ్వాడలో నలుగురు గంజాయి తరలిస్తూ అరెస్ట్
నిరుద్యోగులతో గంజాయి సరఫరా... నలుగురు అరెస్టు
పాడేరు నుంచి దువ్వాడలో గంజాయిని అప్పగిస్తే మనిషికి రెండు వేలు ఇస్తామని ఆశ చూపటంతో... తాము వచ్చామని పట్టుబడినవారు పేర్కొన్నారు. కారుల్లో గంజాయి స్మగ్లింగ్ చేస్తే పోలీసులు కనిపెట్టేస్తున్నారు. అందుకే నిరుద్యోగులకు, విద్యార్థులకు డబ్బు ఎరవేసి వారిని బలిపశువులు చేస్తున్నారు. దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి...అక్రమ గంజాయి పట్టివేత...నలుగురు అరెస్ట్