విశాఖ జిల్లా చోడవరం పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లో రవాణా చేస్తున్న 96 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సరకు విలువ సుమారు రూ.25 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. చీడికాడ రహదారి కూడలి వద్ద 32 కిలోల గంజాయి పట్టుబడగా...వెంకన్నపాలెం చెక్ పోస్టు వద్ద మరో 64 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాల్లో ముగ్గురిని అరెస్ట్ చేయగా...ఓ కారు, బొలెరో వాహనాన్ని సీజ్ చేశారు.
వేర్వురు ప్రాంతాల్లో గంజాయి రవాణా ... 96 కిలోలు పట్టివేత - crime news in vishaka
వేర్వురు ప్రాంతాల్లో రవాణా చేస్తున్న 96 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు విశాఖ జిల్లా చోడవరం పోలీసులు. ఈ సోదాల్లో ముగ్గురిని అరెస్ట్ చేశారు.
Cannabis seized by chodavaram police