రోగులకు వైద్యం అందించడంలో నర్సుల పాత్ర ముఖ్యమని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అర్జున్ అన్నారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ 200వ జయంతిని పురస్కరించుకుని.. ట్రైన్డ్ నర్సెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న వందల మంది నర్సులతో విశాఖ జిల్లా ఆర్కే బీచ్ నుంచి వైఏంసీఏ వరకు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అర్జున్, ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపల్ సుధాకర్, టీఎన్ఏఐ రాష్ట్ర అధ్యక్షురాలు ప్రొఫెసర్ షంషీర్ బేగం పాల్గొన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు ప్రాణం పోసి, వైద్య సేవలు అందించడంలో నర్సులది కీలక పాత్రని అతిథులు అన్నారు. సహనం, త్యాగం ఆభరణాలుగా చేసుకుని రోగుల చిరునవ్వులోనే ఆనందం పొందడమే పరమావధిగా నర్సులు జీవితం సాగుతుందని వ్యాఖ్యానించారు. అలాంటి నర్సులను సత్కరించుకోవడం, సముచిత గౌరవం ఇవ్వడం సమాజంలో ఉన్నత స్థితిని తెలియజేస్తుందని అభిప్రాయపడ్డారు.
విశాఖలో ఘనంగా ఫ్లోరెన్స్ నైటింగేల్ 200వ జయంతి - candle rally on florence nightingale 200th birth aniversary celabrations
ప్రఖ్యాత నర్సు ఫ్లోరెన్స్ నైటింగేల్ 200వ జయంతిని పురస్కరించుకుని విశాఖలో ట్రైన్డ్ నర్సెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న నర్సులు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఆర్కే బీచ్ నుంచి వైఏంసీఏ వరకు సాగిన ర్యాలీలో కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అర్జున్, ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపల్ సుధాకర్, టీఎన్ఏఐ రాష్ట్ర అధ్యక్షురాలు ప్రొఫెసర్ షంషీర్ బేగం పాల్గొన్నారు.
విశాఖలో ఘనంగా ఫ్లోరెన్స్ నైటింగేల్ 200వ జయంతి