విశాఖ కింగ్ జార్జి ఆసుపత్రి, కోవిడ్ ప్రత్యేక ఆస్పత్రుల్లో నర్సింగ్ సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్ల నియామక ప్రక్రియ కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఉదయం నుంచి కేజీహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయం వద్ద పెద్ద సంఖ్యలో అభ్యర్థులు బారులు తీరారు. 500 మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. అవసరం ఎక్కువగా ఉన్నందున మరింత మందికి అవకాశం కల్పిస్తామన్నారు. గురువారం ఉదయం కూడా దరఖాస్తులు స్వీకరిస్తామని ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్ వెల్లడించారు .
ఉద్యోగం కోసం కేజీహెచ్‌కు బారులు తీరిన అభ్యర్థులు - special recruitment staff nurse in kgh vishaka
కరోనా కాలంలో కోవిడ్ బారిన పడిన వారికి సేవలందించేందుకు డాక్టర్లు, నర్సులు కొరత చాలా ఉంది. వారిని కాంట్రాక్టు ప్రాతిపదికను విధుల్లోకి తీసుకునేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. గడువు తేదీ దగ్గర పడుతుండటంతో అభ్యర్ధులు దరఖాస్తులు సమర్పిస్తున్నారు. విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రికి అభ్యర్థులు ఉదయం నుంచే భారీగా తరలివచ్చారు. గురువారం ఉదయం కూడా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్ వెల్లడించారు.
విశాఖ కింగ్ జార్జి ఆసుపత్రి ఎదుట ఉద్యోగం కోసం బారులు తీరిన అభ్యర్థులు
విశాఖ కేజీహెచ్‌లో సీఎస్ఆర్ నిధులతో నిర్మించిన బ్లాక్‌లో 500 పడకలు కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో బాధితులకు చికిత్స అందించేందుకు వీలుగా తీర్చిదిద్దుతున్నారు. రూ.46 కోట్లతో ఈ బ్లాక్ నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. దీనికోసం యుద్ధ ప్రాతిపదికన సిబ్బందిని నియమిస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే మరిన్ని వైద్య సదుపాయాలు కోవిడ్ బాధితులకు అందించే అవకాశం ఉంటుంది.
ఇవీ చదవండి