విశాఖ నగరం పెదగంట్యాడలోని భూలోకమాంబ రెస్టారెంట్ అండ్ బార్ లైసెన్సును పూర్తిగా రద్దు చేస్తూ ఎక్సైజ్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గడువు దాటిన బీర్లను అమ్ముతున్నట్లు గుర్తించిన మేరకు ఈ చర్య తీసుకున్నారు. ఈ విషయంపై ఇదే బార్ మీద గతంలోనూ కూడా నమోదైంది. అధికారులు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి లైసెన్సును రద్దు చేశారు. ఎక్సైజ్ డీసీ శ్రీకాంత్‌రెడ్డి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
వీఐపీ రోడ్‌లోని మైజునో, ఐరన్ హిల్ సంస్థలు మైక్రో బ్రూవరీలను నిర్వహిస్తున్నాయి. ఆయా సంస్థల్లో బీర్లు అక్కడికక్కడే తయారు చేసి విక్రయిస్తారు. ఆయా ప్రక్రియలు నిర్వహించడానికి పలు నిబంధనలను పాటించాలి. శాస్త్రీయ పద్ధతుల్లోనే తయారు చేస్తున్నట్లు అధికారులకు సమాచారం ఇవ్వాలి. నమూనాలను అధికారులకు పంపి అవసరమైన పరీక్షలు కూడా చేయించుకోవాలి. ఈ క్రమంలో కొన్ని నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు.