విశాఖలో తెదేపా మహిళా కార్పొరేటర్ అభ్యర్థులు ఇంటింటి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. 26వార్డులో ముక్కా శ్రావణి, 20వ వార్డులో బైరెడ్డి రాజ్యలక్ష్మి, 18వ వార్డులో గొలగాని మంగవేణి ఓటర్లను కలిసి.. తమను గెలిపించాలని కోరారు. పార్టీ ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకుని విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. జీవీఎంసీ పరిధిలోని సమస్యలతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందులకు పరిష్కారం కోసం కృషి చేస్తామని అభ్యర్థులు చెబుతున్నారు.
విశాఖలో తెదేపా మహిళా అభ్యర్థుల ప్రచారం
మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. జీవీఎంసీ పరిధిలో తెదేపా తరఫున పోటీ చేస్తున్న మహిళా అభ్యర్థులు ఇంటింటి ప్రచారం చేపట్టారు.
మహిళా అభ్యర్థుల ప్రచారం