ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విమ్స్​లో మరో సౌకర్యం.. అప్ డేట్స్ తెలుసుకునేందుకు కాల్ సెంటర్ సదుపాయం - vishakapatnam district news

విశాఖలో కోవిడ్ రోగులకు సేవలు అందిస్తున్న విమ్స్​లో.. ఇప్పుడు సరికొత్త సౌకర్యం అందుబాటులోకి తెచ్చారు. రోగులకు, బంధువులకు వారి చికిత్స విధానాలు ఇతర అంశాలు తెలిపే కాల్ సెంటర్​ ప్రారంభించారు. డైరెక్టర్​గా డాక్టర్ రాంబాబు బాధ్యతలు తీసుకున్న మూడో రోజే ఈ విధాన్నాన్ని ప్రారంభిచారు.

call center at Visakhapatnam vims
రోగులకందుతున్న వైద్యసేవల వివరాలు అందించే కాల్ ​సెంటర్​

By

Published : May 11, 2021, 3:58 PM IST

విశాఖ ఇన్​స్టిట్యూట్​ అఫ్ మెడికల్ సైన్స్​లో ప్రత్యేక కాల్ సెంటర్​ను ప్రారంభించారు. రోగులు ఆసుపత్రిలో చేరే సమయంలో ఇచ్చిన రిజిస్టర్ నెంబర్​కు.. వివరాలతో కూడిన మెసేజ్​ వస్తుంది. రోగి ఆ వివరాలు తన సహాయకులకు తెలపవచ్చు. ఆ ప్రత్యేక నెంబర్​కు కాల్ చేసి రోగి వివరాలను, అందుతున్న సేవలను వారు సైతం తెలుసుకోవచ్చు. వార్డుల వారీగా కోఆర్డినేటర్ల వ్యవస్థను డైరెక్టర్ రాంబాబు విమ్స్ లో ఏర్పాటు చేశారు. కోఆర్డినేటర్ల నంబర్లను కాల్ సెంటర్ ద్వారా మెసేజ్ రూపంలో అందిస్తున్నారు.

ఫలితంగా.. బాధితులు యోగక్షేమాలు బంధువులకు తెలిపే అవకాశం కల్పించారు. అలాగే టెలీ కన్సల్టెన్స్​ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఆసుపత్రిలో ఉన్న రోగులు నిపుణులైన వైద్యుల సలహాలు పొందే అవకాశం కల్పించారు. ఇక... నిరంతరం రోగులకు సేవలు అందిస్తున్న వైద్యులకు పాలు, కాఫీ, టీ అందించే మినీ క్యాంటీన్​ను ఏర్పాటు చేశారు. రోగికి సహాయకులుగా వచ్చిన బంధువులకు ప్రతి రోజు ఉచిత భోజన సౌకర్యం అందిస్తున్నారు. అదే సమయంలో ఆక్సిజెన్, వెంటిలేటర్ల కొరత లేకుండా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేశారు. విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాంబాబు ఈ విషయమై మాట్లాడుతూ.. గతంలో స్టేట్ నోడల్ అధికారిగా చేసిన అనుభవంతో.. అత్యున్నత వైద్య సేవలు అందేలా ముందుకు తీసుకెళ్తానని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details