ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖలో కాగ్ బృందం పర్యటన - మధ్యాహ్నం భోజనంపై కాగ్ రిపోర్టు తాజా వార్తలు

విశాఖ జిల్లాలో నాలుగు రోజులుగా కాగ్ బృందం పర్యటిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలిస్తోంది. పథకం అమలుపై విద్యార్థుల తల్లిదండ్రులను ఆరా తీస్తున్నారు.

cag  report on mid day meals at vishakapatnam district
విశాఖలో కాగ్ బృందం పర్యటన

By

Published : Dec 11, 2020, 3:49 PM IST

విశాఖ జిల్లాలో కాగ్ బృందం పర్యటిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని బృందం పరిశీలిస్తోంది. కరోనా కారణంగా మార్చి నుంచి పాఠశాలలన్నీ మూతపడ్డాయి. అప్పటినుంచి మధ్యాహ్న భోజనం స్థానంలో బియ్యం, గుడ్లు, పల్లిల చెక్కిలు డ్రై రేషన్ రూపంలో విద్యార్థుల ఇళ్లకే అందజేస్తున్నారు. ఈ రేషన్ లబ్ధిదారులకు సక్రమంగా వెళ్లిందా లేదా, సరకుల పంపిణీకి సంబంధించి దస్త్రాల నిర్వహణపై క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపడుతున్నారు.

జిల్లాలో నాలుగు రోజులుగా ఈ బృందం విశాఖలో పర్యటిస్తోంది. ఈరోజు జీవీఎంసీ పరిధిలోని ప్రకాష్​రావుపేట పాఠశాలను కాగ్ డైరెక్టర్ అకౌంట్ జనరల్ గౌతమ్ అల్లాడ పరిశీలించారు. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి డ్రై రేషన్​పై ఆరా తీశారు. తమ పరిశీలనలో గుర్తించిన అంశాలను నివేదిక రూపంలో కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని కాగ్ బృందం తెలిపింది.

ఇదీ చదవండి: ఆస్తులు అమ్మి నిధులు సమకూర్చుకోవాల్సిన పని ఉందా..? : హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details