ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డ్రై రేషన్ పంపిణీపై కాగ్​ పరిశీలన

కరోనా సమయంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పంపిణీ చేసిన డ్రై రేషన్​లోని అవకతవకలపై కాగ్ క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ పథకానికి సంబంధించిన అన్ని రికార్డులను బృందాలు పరిశీలించనున్నాయి. దీంతో ఆ రికార్డులను అప్​డేట్​ చేసే పనిలో పడ్డారు విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు.

By

Published : Dec 4, 2020, 4:31 PM IST

cag investigation
డ్రై రేషన్ పంపీణీ పై కాగ్​ పరిశీలన

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కరోనా కాలంలో జరిపిన డ్రై రేషన్ పంపిణీపై వచ్చిన ఫిర్యాదులను కాగ్ పరిశీలించనుంది. ఈ ప్రత్యేక బృందాలు డిసెంబర్ ఏడో తేదీ నుంచి రాష్ట్ర విద్యాశాఖకు సంబంధించిన జిల్లా, మండల స్థాయి కార్యాలయాల్లో తనిఖీలు జరపనున్నాయి. మధ్యాహ్నం భోజనం పథకం అమలు తీరుతో పాటు... మార్చి 19 నుంచి అక్టోబర్ 31 వరకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు డ్రై రేషన్ పంపిణీ ఏ విధంగా జరిగిందన్న విషయాన్ని ప్రత్యేక ఆడిట్ బృందాలు క్షుణ్ణంగా తనిఖీ చేయనున్నాయి.

దీంతో ఇందుకు సంబంధించిన పది రకాల రికార్డులను అప్​డేట్​ చేసే పనిలో విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు తలమునకలయ్యారు. ఈ అంశాలను వివరించి తగు జాగ్రత్తలు తీసుకునే విషయమై ఇప్పటికే విద్యాశాఖ అధికారులు వివిధ స్థాయిలో సమీక్ష సమావేశాలు నిర్వహించారు .

కరోనా కారణంగా ఈ ఏడాది మార్చి 19వ తేదీ నుంచి అక్టోబరు 31 వరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు డ్రై రేషన్ పంపిణీ చేశారు. ఇప్పటివరకు ఆరు విడతలుగా ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదివే విద్యార్థులకు ప్రతి వారం 600 గ్రాముల బియ్యం, 6 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు 900 గ్రాముల బియ్యం అందించారు. వీటితోపాటు ఐదు కోడిగుడ్లు, 3 చక్కిలాలు చొప్పున పంపిణీ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాలలకు పిలిపించి ఈ డ్రై రేషన్ సరుకులను అందజేశారు.

అయితే అనేక ప్రాంతాల్లో వీటి పంపిణీ సక్రమంగా జరగలేదని... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరఫరా చేసిన సరుకులను పక్కదారి పట్టించారని ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు ఆడిట్ బృందాలు క్షేత్రస్థాయిలో తనిఖీలు జరపనున్నాయి.

ఇదీ చదవండీ...రాష్ట్రంలో ఏం జరిగినా తెదేపా నాయకులకే ముడిపెడతారా?: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details