విశాఖ జిల్లా గొలుగొండ మండలం జీడిగుమ్మలకు చెందిన కేబుల్ ఆపరేటర్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఆడిగర్ల రాము కేబుల్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం కొంతమంది స్నేహితులతో కలిసి పెద్దపేట గ్రామంలో మద్యం సేవించడానికి వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో బాగా మద్యం తాగాడని.. ఆ తర్వాత చనిపోయి కనిపించినట్లు స్థానికులు చెప్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కేబుల్ ఆపరేటర్ అనుమానాస్పద మృతి - జీడిగుమ్మలలో కేబుల్ ఆపరేటర్ మృతి
కేబుల్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన విశాఖ జిల్లా జీడిగుమ్మలలో జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కేబుల్ ఆపరేటర్ అనుమానాస్పద మృతి