విశాఖలో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో వైద్య విద్యార్థిని మృతి చెందింది. ఆంధ్ర వైద్య కళాశాలలో మూడో ఏడాది చదువుతున్న లావేటి సంతోష్, శ్రీదివ్య... కేజీహెచ్ నుంచి ద్విచక్రవాహనంపై గాజువాక వెళ్తున్నారు. మారుతి సర్కిల్ దగ్గరకు వచ్చే సరికి ద్విచక్రవాహనం అదుపుతప్పి పడిపోయారు. అదే సమయంలో వెనక నుంచి వస్తున్న లారీ శ్రీవిద్య తల పైనుంచి వెళ్లటంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ద్విచక్ర వాహనం నడుపుతున్న సంతోష్ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించారు.
విశాఖలో రోడ్డు ప్రమాదం... వైద్య విద్యార్థిని మృతి - విశాఖలో వైద్య విద్యార్థిని మృతి
విశాఖలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వైద్య విద్యార్థిని మృతి చెందింది. ద్విచక్రవాహనంపై వైద్య విద్యార్థులు సంతోష్, శ్రీదివ్య వెళ్తుండగా అదుపుతప్పి పడిపోయారు. వెనక నుంచి వస్తోన్న లారీ శ్రీదివ్య తలపై నుంచి వెళ్లటంతో అక్కడికక్కడే మృతి చెందింది.
విశాఖలో రోడ్డు ప్రమాదం...వైద్య విద్యార్థిని మృతి