ఎండలు మండిపోతున్న తరుణంలో విశాఖ జిల్లా అనకాపల్లిలో చలివేంద్రాల ఏర్పాటుపై స్వచ్ఛంద సంస్థలు దృష్టి సారిస్తున్నాయి. అనకాపల్లి నూకాలమ్మ జాతరకు విచ్చేసిన భక్తులకు వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు మజ్జిగ చలివేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చారు.
ఈ చలివేంద్రాన్ని తెదేపా అర్బన్ జిల్లా ఉపాధ్యక్షులు మళ్ల సురేంద్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. అనకాపల్లి పట్టణ ఎస్సై స్వామి నాయుడు చేతుల మీదుగా ఈ కేంద్రాన్ని ప్రారంభించి భక్తులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.