సంక్రాంతి పండుగ సందర్బంగా బస్టాండ్, రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది. ప్రధాన పట్టణాల్లో స్థానికులు స్వగ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని రైల్వే పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విశాఖ నుంచి బయలుదేరే ప్రత్యేక రైలులో జనరల్ బోగి వద్ద ప్రత్యేక క్యూలైన్ల ద్వారా ఒక్కొక్కరిని సీట్ల వద్దకు పంపిస్తున్నారు. ఈ పద్ధతి పట్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడా తొక్కిసలాటకు ఆస్కారం లేకుండా రైల్వే పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు.
సంక్రాంతికి సొంతూరికి పయనం.. కిటకిటలాడుతోన్న రైల్వే, బస్ స్టేషన్లు - ప్రయాణికులతో కిటకిటలాడుతున్న బస్టాండ్
సంక్రాంతి పండుగకు ప్రజలంతా తమ ఊళ్లకు వెళ్తుండటంతో ప్రధాన పట్టణాల్లో రైల్వే, బస్ స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. రద్దీని దృష్టిలో ఉంచుకొని అధికారులు అదనపు ఏర్పాట్లు చేసినా ఇబ్బందులు తప్పడం లేదు. రైల్వే స్టేషన్లలో తొక్కిసలాట జరగకుండా రైల్వే పోలీసులు భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.

ప్రయాణికులతో కిటకిటలాడుతున్న బస్టాండ్, రైల్వేస్టేషన్
ప్రయాణికులతో కిటకిటలాడుతున్న బస్టాండ్, రైల్వేస్టేషన్లు