విశాఖ జిల్లా చోడవరం పట్టణానికి చెందిన వ్యాపారి ఎస్ఎస్ఎన్ రెడ్డి.. స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి రెండు ఆక్సిజన్ యంత్రాలు అందజేశారు. వీటిని రూ.1.20 లక్షల వ్యయంతో సమకూర్చినట్లు వ్యాపారి వివరించారు. ఈ యంత్రాల ద్వారా 5 లీటర్ల వరకు ఆక్సిజన్ లభ్యమవుతుందని వైద్యాధికారి మహేశ్ పేర్కొన్నారు. దీని ద్వారా కొవిడ్ కేంద్రాల్లో పిల్లలు, పెద్దలకు ఉచితంగా అక్సిజన్ పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ఇలియాస్ మహమ్మద్, వైద్యాధికారి మహేశ్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ఆరోగ్య కేంద్రానికి రెండు ఆక్సిజన్ యంత్రాలు అందజేసిన వ్యాపారి - business man donate oxygen concentrators to phc
చోడవరం సామాజిక ఆరోగ్య కేంద్రానికి ప్రముఖ వ్యాపారి ఎస్ఎస్ఎన్ రెడ్డి.. రూ.1.20 లక్షల వ్యయంతో రెండు ఆక్సిజన్ యంత్రాలు అందజేశారు.
business man donate oxygen concentrators to phc