ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శుక్రవారం నుంచి ఆంధ్రా-ఒడిశా మధ్య బస్సు సర్వీసులు - ఏపీ బస్సు సర్వీసులు వార్తలు

శుక్రవారం నుంచి ఆంధ్రా-ఒడిశా మధ్య బస్సు సర్వీసులు నడవనున్నాయి. రాష్ట్ర రవాణాశాఖ అనుమతితో బస్సులు తిప్పనున్నారు.

Bus services to Andhra Pradesh and Odisha from tomorrow
రేపటినుంచి ఆంధ్రా- ఒడిశాకు బస్సు సర్వీసులు ప్రారంభం

By

Published : Sep 23, 2020, 10:37 PM IST

ఆరు నెలలపాటు డిపోలకు పరిమితమైన బస్సులు కదులుతున్నాయి. రాష్ట్ర రవాణాశాఖ అనుమతితో అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు మొదలయ్యాయి. శుక్రవారం రోజున విశాఖ ద్వారక బస్ కాంప్లెక్స్ నుంచి ఒడిశాలోని వివిధ ప్రాంతాలకు బస్సు సర్వీసులు నడవనున్నాయి. ఉదయం నాలుగు గంటలకు గునుపూర్, 4:30 గంటలకు నవరంగ్​పూర్, 5 గంటలకు ఒనకఢిల్లీ, 7 గంటలకు పర్లా కిమిడి, మధ్యాహ్నం 1:45కి థమన్ జోడి, 2:30 నిమిషాలకు జైపూర్, తిరిగి రాత్రి 8:30 నిమిషాలకు ఇంద్రావతి సర్వీసులు నడపడానికి నిర్ణయం తీసుకున్నారు అధికారులు. ఏపీఎస్​ఆర్టీసీ అధికారిక వెబ్​సైట్​లో ఈ బస్సులకు రిజర్వేషన్ సౌకర్యం కలిపిస్తోంది. శుక్రవారం రోజున ఆంధ్ర-ఒడిశా మధ్య బస్సు సర్వీసులను తిప్పడానికి ఏర్పాట్లు చేస్తున్నారు విశాఖ ఆర్టీసీ అధికారులు.

ABOUT THE AUTHOR

...view details