ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నదిలోకి దూసుకెళ్లిన బస్సు.. ముగ్గురికి గాయాలు - విశాఖపట్నంలో రోడ్డు ప్రమాదం

విశాఖ జిల్లా ఎస్.రాయవరం జాతీయ రహదారి వద్ద చెన్నై నుంచి విశాఖ పట్టణం వెళ్తున్న ప్రైవేట్ బస్సు వరాహ నదిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి.

bus rushed in to river at s.rayavaram
నదిలోకి దూసుకెళ్లిన బస్సు.. ముగ్గురికి గాయాలు

By

Published : Sep 10, 2020, 10:05 AM IST

నదిలోకి దూసుకెళ్లిన బస్సు.. ముగ్గురికి గాయాలు

విశాఖ జిల్లా ఎస్.రాయవరం జాతీయ రహదారి వద్ద భారీ ప్రమాదం తప్పింది. చెన్నై నుంచి విశాఖ పట్టణం వెళ్తున్న ప్రైవేట్ బస్సు బుధవారం అర్ధరాత్రి వరాహ నదిలోకి దూసుకుపోయింది. బస్సులో ముగ్గురు ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. వారు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. సమాచారం అందుకున్న రాయవరం పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details