Bus crashes into a crop: విశాఖ జిల్లా పెందుర్తి మండలం రాంపురం గ్రామ శివారులో ప్రైవేట్ కాలేజ్ బస్సు అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకెళ్లింది. అయితే అందులో విద్యార్థులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజిలో పనిచేసే బస్సు డ్రైవర్... రాంపురం నుంచి తన భార్య, మరికొందరితో వెళ్తండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
పంట కాలువలోకి దూసుకెళ్లిన బస్సు...ముగ్గురికి గాయాలు - విశాఖ జిల్లా తాజా వార్తలు
విశాఖ జిల్లా పెందుర్తి మండలం రాంపురం గ్రామ శివారులో ప్రైవేట్ కాలేజ్ బస్సు పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి.
పంట కాలువలోకి దూసుకెళ్లిన బస్సు