విశాఖ బురుజుపేటలో కొలువైన శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాల తేదీలను దేవస్థానం ప్రకటించింది. ఈనెల 15 నుంచి జనవరి 13 వరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో జ్యోతిమాధవి వెల్లడించారు. మంగళవారం ఉదయం 10.10 నిమిషాలకు వైదిక కార్యక్రమాలతో వేడుకలు ప్రారంభమవుతాయని తెలిపారు.
ఈ నెల 15 నుంచి బురుజుపేట శ్రీ కనకమహాలక్ష్మి మార్గశిర మాసోత్సవాలు - vizag latest news
విశాఖ శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాల తేదీలు ఖరారయ్యాయి. ఈనెల 15 నుంచి జనవరి 13 వరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకున్న భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని స్పష్టం చేశారు.
ఈ నెల 15 నుంచి బురుజుపేట శ్రీ కనకమహాలక్ష్మి మార్గశిర మాసోత్సవాలు
ఈ మార్గశిర మాసంలో వస్తున్న నాలుగు గురువారాల్లో అమ్మవారికి పంచామృతాభిషేకం, స్వర్ణాభరణ అలంకరణ, ప్రత్యేక పూజలు ఉంటాయన్నారు. కొవిడ్ నిబంధనల ప్రకారం అన్ని రకాల ఉచిత దర్శనాలకు ముందుగా ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. అంబికా బాగ్ సీతారామస్వామి అలయం, టౌన్ కొత్త రోడ్ జగన్నాధస్వామి అలయాల వద్ద టైమ్ స్లాట్ టోకెన్లు విక్రయిస్తారని తెలిపారు.
ఇదీ చదవండి: ఏకాదశి నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం