ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పూడిన పంట కాలువలు.. మరమ్మతులు చేసిన రైతులు - Buried crop drains- farmers removed

ఆరేళ్లుగా ఆ పంట కాలువల్లో పూడిక పెరిగిపోయింది. నీటిని విడుదల చేసినా ఆయకట్టుకు అందడం గగనమైపోయింది. దీంతో తమ పంటలకు నీరు అందించాలని ఆ ప్రాంత రైతులంతా నిర్ణయించుకున్నారు. పలుగు పారా పట్టి కాలువల్లో పూడికను తొలగించారు. వారి శ్రమకు ఫలించి… సాగు నీరు కాలువల్లో ఉరకలేస్తూ…ఇప్పుడు పొలాలకు అందుతోంది.

Buried crop drains- farmers removed
పూడిన పంట కాలువలు-తొలగించిన రైతులు

By

Published : Aug 31, 2020, 1:01 PM IST

విశాఖ జిల్లా రావికమతం మండలం కళ్యాణపులోవ జలాశయం ప్రధాన కాలువల్లో ఆరేళ్లుగా పూడిక పేరుకుపోయింది. ఈ ఏడాది ఖరీఫ్ పంటకు ఈనెల రెండునే నీటిని విడుదల చేసినప్పటికీ దిగువ ప్రాంతాల ఆయకట్టుకు నీరు అందటం లేదని రైతులు ఆందోళన చెందారు. దొండపూడి, మత్సవాని పాలెం గ్రామాలకు చెందిన సుమారు 100 మంది రైతులు వారం పాటు రాత్రింబవళ్ళు శ్రమించి పంట కాలువలు శుభ్రం చేసి… రూపురేఖలు మార్చేశారు. దీంతో ఆయకట్టు భూములకు నీరు పుష్కలంగా అందుతోంది.

ABOUT THE AUTHOR

...view details