సంక్రాంతి అంటే మనకు మూడు రోజులే. విశాఖ జిల్లా చోడవరం, బుచ్చయ్యపేట, మాడుగుల, చీడికాడలోని ఈ యువ రైతులకు మాత్రం.. సంక్రాంతి నుంచి శ్రీరామనవమి వరకూ అన్నీ పండగ రోజులే. ఎడ్ల పందేలంటే ఆసక్తి చూపే వీళ్లంతా.. ఈ 120 రోజుల పాటు ఎక్కడ పోటీ జరిగినా వాలిపోతారు. సంక్రాంతి నుంచి శ్రీ రామనవమి వరకు పండగ తీర్థ ఉత్సవాలు చాలా ప్రాంతాల్లో జరుగుతుంటాయి. ఈ సందర్భంగా ఎడ్ల బళ్ల పరుగు పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీలకు అనువుగా ఎద్దులను పెంచుతారు. వీటి ఖరీదు అయిదు లక్షల రూపాయలుగా ఉంటుంది. అయినా.. వీటిని పోటీలకే పరిమితం చేస్తారు. ఎద్దుల పోషణకు ఖర్చు ఎక్కువే అయినా, పోటీల్లో గెలిస్తే వచ్చే ఆనందం వాటి ముందు కనిపించదంటారు... ఈ యువకులు.
ఎప్పుడైనా.. ఎక్కడైనా.. ఎడ్ల పోటీలకు సై..! - vizag Bullock cart games
విశాఖ జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో ఎడ్లను పెంచుతున్న ఈ యువ రైతులు.. ఎక్కడ ఎడ్ల పందేలు జరిగినా పోటీకి సై అంటున్నారు. ఖర్చుతో కూడుకున్న పనే అయినా.. పేరు ప్రఖ్యాతులు కూడా ముఖ్యమే అంటున్నారు.
![ఎప్పుడైనా.. ఎక్కడైనా.. ఎడ్ల పోటీలకు సై..! Bullock cart games in vishaka](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5726085-771-5726085-1579167379834.jpg)
ఎడ్లబండి పోటీలకు సిద్ధమవుతున్న విశాఖ