విశాఖలో భీమిలి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భీమునిపట్నం స్థానిక మినీ క్రీడా మైదానంలో ఎడ్లబండ్ల పోటీలను మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రారంభించారు. విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన 25 ఎడ్లబండ్లు ఈ పోటీలో పాల్గొన్నాయి. రైతులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఎడ్లబండ్ల పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సంప్రదాయ పోటీలను తిలకించేందుకు పలువురు ఆసక్తి చూపారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాల్లో పాఠశాల విద్యార్థులకు పలు క్రీడా పోటీలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
భీమిలి ఉత్సవాల్లో ఘనంగా ఎడ్లబండ్ల పోటీలు - bull competition in bhemili
రైతులను ప్రోత్సహించే దిశగా విశాఖలో భీమిలి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను మంత్రి అవంతి శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభించారు.
![భీమిలి ఉత్సవాల్లో ఘనంగా ఎడ్లబండ్ల పోటీలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5013394-560-5013394-1573299610075.jpg)
భీమిలీ ఉత్సవాల్లో ఘనంగా ఎడ్లబండి పోటీలు నిర్వహణ
భీమిలీ ఉత్సవాల్లో ఘనంగా ఎడ్లబండి పోటీలు నిర్వహణ
ఇదీ చదవండి:
TAGGED:
bull competition in bhemili