ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఈనెల 15న భవన నిర్మాణ కార్మికుల 'ఛలో విజయవాడ'

By

Published : Dec 13, 2020, 7:22 PM IST

కరోనా కాలంలో ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులకు నెలకు రూ. 10వేల చొప్పున 6 నెలలపాటు అందించాలని కోరుతూ.. బిల్డింగ్- కన్​స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈనెల 15న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించనున్నారు. విశాఖ సీపీఎం కార్యాలయంలో ఈ కార్యక్రమ గోడపత్రికను ఆవిష్కరించారు.

chalo vijayawada
ఈనెల 15న భవన నిర్మాణ కార్మికుల 'చలో విజయవాడ' కార్యక్రమం

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతేడాది ఇసుక కారణంగా నిర్మాణ పనులు ఆగిపోయాయని భవన నిర్మాణ కార్మికుల సంఘం గౌరవాధ్యక్షుడు కృష్ణారావు అన్నారు. విశాఖలో మాట్లాడుతూ.. ఈ ఏడాది కరోనా కారణంగా నిర్మాణ రంగం కుదేలైందని.. కార్మికులు పనుల్లేక ఆదాయం కోల్పోయారన్నారు. అందుకే నిర్మాణ కార్మికులకు నెలకు రూ. 10వేల చొప్పున 6 నెలలపాటు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని కోరారు.

రాష్ట్రప్రభుత్వం కార్మికుల సంక్షేమ నిధిని ఇతర పథకాలకు ఖర్చు చేస్తోందని కృష్ణారావు ఆరోపించారు. సంక్షేమ బోర్డును మూసివేసేందుకు ప్రభుత్వం యోచిస్తోందని అన్నారు. ఈ క్రమంలో నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 15న ఛలో విజయవాడ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details