విశాఖ జిల్లా అచ్యుతాపురం మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ పైనుంచి జారిపడి భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందాడు. భవన నిర్మాణం పనుల్లో ఎర్ర అప్పలనాయుడు పని చేస్తుండగా.. ప్రమాదం చోటు చేసుకుంది. భవన నిర్మాణ యజమానుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన సంభవించిందంటూ మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.
పరిహారం ఇవ్వాల్సిందే..
తమకు వెంటనే పరిహారం చెల్లించాలని.. భవనం ముందు మృత దేహంతో బాధిత కుటుంబీకులు ఆందోళన చేపట్టారు. యజమాని నారాయణ రావు సంఘటన స్థలానికి చేరుకుని బాధితులతో చర్చించారు. నిర్మాణ పనుల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు అచ్యుతాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి : Surabhi: కన్నీరు పెడుతున్న 136 ఏళ్ల ఘన చరిత్ర