ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాఠశాల గేటులో ఇరుక్కుపోయిన పాడిగేదె - విశాఖలో గేటులో ఇరుకున్న పాడిగేదె

విశాఖ జిల్లా దేవరాపల్లిలో ఓ పాడిగేదె గడ్డి మేసి తిరిగి వెళ్తున్న సమయంలో... గేటులో ఇరుక్కుపోయింది. గమనించిన స్థానికులు దాన్ని గేటులోంచి బయటికి తీయటానికి ప్రయత్నించారు.

buffalo strucked in school gate at devarapally in vishakaptnam
పాఠశాల గేటులో ఇరుక్కుపోయిన పాడిగేదె

By

Published : Jun 2, 2020, 11:22 AM IST

విశాఖ జిల్లా దేవరాపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో... గ్రామానికి చెందిన జామి పోతురాజు పాడిగేదె గడ్డి మేస్తుంది. గడ్డి మేసి తిరిగి వెళ్తున్న సమయంలో పాఠశాల గేటు నుంచి బయటకు వెళ్లడానికి ప్రయత్నించి అందులో ఇరుక్కుపోయింది. స్థానికులు, రైతులు పాడిగేదెను బయటకు లాగడానికి గంటలు తరబడి ప్రయత్నించినా... ఫలితం లేకపోయింది. చేసేదేమిలేక వెల్డింగ్ యంత్రంతో గేట్​ను కట్ చేసి అతికష్టం మీద గేటులో ఇరుక్కుపోయిన గేదెను బయటకు తీశారు.

ABOUT THE AUTHOR

...view details