విశాఖ జిల్లాలోని అనకాపల్లి మండలం కొత్తూరు సమీపంలో ఓ గేదె డ్రైనేజీ కాలువలో పడిపోయింది. కాలువపై ఉన్న సిమెంటు పలక విరిగిపోవడంతో గేదె అందులో చిక్కుకుంది.
ఆ గేదెను కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. గేదె కాళ్లకు తాళ్లు కట్టి, ప్రొక్లెయిన్ సాయంతో బయటకు తీశారు. ప్రాణాపాయం నుంచి తప్పించారు.