ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బౌద్ధరామాలను పరిరక్షించాలి, మంత్రికి వినతిపత్రం - buddhists

300 ఏళ్ల చరిత్ర కలిగిన తొట్లకొండ ప్రాంతం, విశాఖ జిల్లాలోని పలు బౌద్ధరామాలను అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని భౌద్ద సంఘాల ప్రతినిధులు పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు.

పర్యాటకశాఖ మంత్రిని కలిసిన బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ కమిటీ

By

Published : Sep 10, 2019, 4:23 PM IST

పర్యాటకశాఖ మంత్రిని కలిసిన బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ కమిటీ

300ఏళ్ల చరిత్ర కలిగిన తొట్లకొండ ప్రాంతాన్ని కాపాడాలని భౌద్ద సంఘాల ప్రతినిధులు,బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ కమిటీ ప్రభుత్వాన్ని కోరారు.బౌద్ధరామాలను కబ్జా చేసేందుకు చాలా మంది యత్నిస్తున్నారని కమిటీ కన్వీనర్ కొత్తపల్లి వెంకటరమణ తెలిపారు.విశాఖ జిల్లాలో ఉన్న తొట్లకొండ,బావికొండ,పావురాలకొండ,బొజ్జన్నకొండ మాధవధార కొండ,అప్పీకొండ ప్రాంతాలలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకుండా ప్రభుత్వం వాటికి రక్షణ కల్పించాలని పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు.బౌద్దరామాల ప్రాంతాల్లో ఎటువంటి నిర్మాణాలు జరగకుండా చర్యలు చేపడతామని మంత్రి హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details