విశాఖ ఏజెన్సీ పాడేరు ఘాట్ రోడ్లో విరిగిపడిన కొండ చరియలను పోలీసులు తొలగించే చర్యలు చేపట్టారు. రాత్రి కురిసిన భారీ వర్షాలకు రోడ్డుకి అడ్డంగా కొండ చరియలు విరిగి పడ్డాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నిత్యం రద్దీగా ఉండే విశాఖ పాడేరు ఘాట్ రోడ్డుపై ప్రయాణానికి అడ్డుగా ఉన్న కొండ చరియలను పోలీసులు తొలిగించి.. రాత్రికి రాత్రే రాకపోకలు యధావిధిగా సాగేలా చేశారు.
విరిగిపడ్డ కొండ చరియలు.. రాత్రికి రాత్రే..? - Broken cliffs on Paderu ghat road at visakhapatnam news
విశాఖ మన్యంలోని పాడేరు ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రాత్రికి రాత్రే రోడ్డుకు అడ్డుగా విరిగిపడ్డ మట్టి, రాళ్లను తొలగించారు.
విరిగిపడ్డ కొండ చరియలు
ఇవీ చూడండి..