ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 15, 2020, 5:25 PM IST

ETV Bharat / state

బ్రాండిక్స్ ఫ్యాక్టరీలో సిద్ధమవుతున్న కరోనా సూట్లు

విశాఖ బ్రాండిక్స్ ఫ్యాక్టరీ లో కరోనా సూట్లు సిద్ధమవుతున్నాయి. శ్రీలంక నుంచి వచ్చిన ఇంజినీర్లు వీటి తయారీకి ముందుకువచ్చారు.

vishaka district
బ్రాండిక్స్ ఫ్యాక్టరీలో సిద్ధమవుతున్న కరోనా సూట్లు

లాక్ డౌన్ ఆరంభం నుంచి మూతబడిన బ్రాండిక్స్ ప్రాంగణంలో అన్ని ఉత్పత్తులు నిలిచిపోయాయి. శ్రీలంకకు చెందిన దాదాపు 120 మంది వరకు ఉద్యోగులు అధికారులు బ్రాండిక్స్ లోనే వసతి గృహాల్లో ఉంటున్నారు. కరోనాతో పోరాడే ఈ క్రమంలో వైద్యులు, నర్సింగ్ సిబ్బందికి.. పీపీఈలు తయారీ చేయాలని నిర్ణయించారు. రోజుకు కనీసం 1000 సూట్లు తయారీకి.. ఉన్న అవకాశాలను వినియోగించుకుంటున్నారు.

బ్రాండిక్స్ సూట్

బ్రాండ్ భారత భాగస్వామి దొరస్వామి ఈ చర్య కోసం చొరవ తీసుకున్నారు. ఫలితంగా ప్రాంగణంలోనే ఉంటున్న శ్రీలంక నుంచి వచ్చిన ఇంజినీర్లు ఇతర అధికారులు బ్రాండిక్స్ లో ఈ సూట్లు తయారీకి ముందుకు వచ్చారు. వారే స్వయంగా వీటిని తయారు చేస్తున్నట్లు భారత భాగస్వామి దొరస్వామి వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details