ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెందుర్తిలో పిడుగుపాటుకు బాలుడు మృతి - విశాఖ జిల్లా వార్తలు

విశాఖ జిల్లా పెందుర్తి మండలం నల్ల క్వారీలో పిడుగు పడి ఒక బాలుడు మృతి చెందాడు. బాలుని తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గుర్తించిన స్థానికులు ఆమెను 108లో ఆస్పత్రికి తరలించారు.

పెందుర్తిలో పిడుగుపాటుకు బాలుడు మృతి
పెందుర్తిలో పిడుగుపాటుకు బాలుడు మృతి

By

Published : Jun 8, 2021, 7:57 PM IST



విశాఖ జిల్లా పెందుర్తిలో మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. నల్లక్వారికి చెందిన పావని తన ఇంటి మేడపైన బట్టలు తీద్దామని తన ఆరేళ్ల కుమారుడు రోహిత్​ను తీసుకువెళ్లింది. అదే సమయంలో పిడుగు పడటంతో బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. బాలుని తల్లి పావనికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గుర్తించిన స్థానికులు ఆమెను 108లో ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details