నిద్రిస్తున్న బాలుడిని కాటేసిన పాము - మన్యంలో పాముకాటుతో బాలుడు మృతి
విశాఖ మన్యంలో విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో తండ్రి పక్కన నిద్రిస్తున్న ఓ బాలుడిని పాము కాటేసింది. ఆసుపత్రికి తరలిస్తుండగా చిన్నారి మృతి చెందాడు.

పాముకాటు
విశాఖ ఏజెన్సీ జి.మాడుగుల మండలం కోరాపల్లి పంచాయతీ వయ్యపల్లిలో పాముకాటుతో బాలుడు మృతి చెందాడు. తండ్రి పక్కన నిద్రిస్తున్న ఆరేళ్ల బాలుడు బాలన్నను ఓ పాము కాటేసింది. వెంటనే జి.మాడుగుల ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఇంట్లో ఉన్న పామును గుర్తించి కుటుంబసభ్యులు కర్రలతో కొట్టి చంపేశారు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందటంతో తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.